
చివరికి పరుగుల తేడాతో ఇండియా విజయాన్ని అందుకుంది. ఈ రోజు సెకండ్ వన్ డే రాయ్ పూర్ వేదికగా ఇంకాసేపట్లో మొదలు కానుంది. ఇండియా జట్టులో శుబ్ మాన్ గిల్, కోహ్లీ , రోహిత్, సూర్య , హార్దిక్ , ఇషాన్ కిషన్ , వాషింటన్ సుందర్ ఇలా అందరూ టాలెంట్ ఉన్న ఆటగాళ్లే అయినా ఎందుకో స్థాయికి తగిన ప్రదర్శన చేయడంలో రోహిత్, ఇషాన్ మరియు పాండ్యాలు ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యంగా ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత శ్రీలంక సిరీస్ నుండి చక్కని ఆరంభాలు లభిస్తున్నా ఎందుకో వాటిని భారీ స్కోర్ లుగా మలచడంలో ఫెయిల్ అవుతున్నాడు.
మరి ఈ రోజు జరగనున్న రెండవ వన్ డే లో అయినా రోహిత్ సెంచరీ సాధించి మునుపటి ఫామ్ ను అందుకుంటాడా అన్నది చూడాలి. కాగా ఈ రోజు మ్యాచ్ లో కనుక ఇండియా గెలిస్తే సిరీస్ మనదే అవుతుంది. ఇక గత మ్యాచ్ లో మూకుమ్మడిగా విఫలం అయిన కివీస్ ఆటగాళ్లు ఇండియా కు సిరీస్ ను అందకుండా అడ్డుపడతారా అన్నది సీతేలియాలంటే మరికాసేపు ఎదురుచూడాలి.