ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇక ప్రతి నెల కూడా ప్రపంచ క్రికెట్లో బాగా రాణించిన ఆటగాళ్లకు అవార్డులు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రతి నెల మంచి ఫామ్ కనబరిచి.. అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని ఇక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులోకి నామినేట్ చేసి ఇక అందులో ఒకరికి అవార్డు కట్టబెట్టడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇక ఐసిసి ప్రకటించే ఈ అవార్డులు ప్రతి నెల కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.


 ఇక ఇలా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే అవార్డులను సొంతం చేసుకోవడానికి ఎంతో మంది ఆటగాళ్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల జనవరి నెలకు గాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్ల లిస్టును ఇటీవల ప్రకటించింది. ఇక ఇందులో భారత జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం గమనార్హం. కొన్ని రోజుల నుంచి అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతున్న యువ ఓపెనర్ శుభమన్ గిల్.. ఫేసర్ మహమ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం నామినేట్ అయ్యారు.


 ఇద్దరు కూడా న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మన్ డేవన్ కాన్వే తో పోటీ పడుతున్నారు అని చెప్పాలి. అయితే ఈ ముగ్గురిలో కూడా ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరికి దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా శుభమన్ గిల్ టి20 లు వన్డే ఫార్మాట్లో ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం రోజుల వ్యవధిలోనే   సెంచరీలు చేసి ఎన్నో ప్రపంచ రికార్డులు కూడా సృష్టించాడు. ఈ క్రమంలోనే ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.  ఇక మహమ్మద్ సిరాజ్ బుమ్రా లేని లోటును తీరుస్తూ టీమ్ ఇండియాలో ప్రధాన బౌలర్గా మారిపోయాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ లో తొమ్మిది వికెట్లతో అదరగొట్టాడు.  న్యూజిలాండ్తో వన్డే సిరీస్ లోను ఇదే తరహ ప్రదర్శన చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc