బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇరు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 9వ తేదీన అంటే రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కోసం అటు అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. అయితే సొంత గడ్డపై ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియాని ఓడించడం అటు ఆస్ట్రేలియాకు ఒక పెద్ద సవాలు లాంటిదే అని చెప్పాలీ.


 ఈ క్రమంలోనే భారత్లో ఆస్ట్రేలియా పర్యటన ఎలా ఉంటుంది అనే దానిపైనే అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే భారత్తో టెస్ట్ సిరీస్ కు సన్నతమవుతున్న వేళ అటు ఆస్ట్రేలియా జట్టుకు మాత్రం వరుసగా షాక్ లు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. జట్టులో ఉన్న కీలక ప్లేయర్లు అందరూ కూడా గాయాల బారిన పడుతూ వరుసగా జట్టుకు దూరమవుతూ ఉండడంతో అటు ఆస్ట్రేలియా జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అయితే గత కొంతకాలం నుంచి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర వహిస్తున్న కామరూన్  గ్రీన్ కూడా ఇప్పుడు జట్టుకు దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.



 ఇప్పటికే కామరూమ్ గ్రీన్ వేలిగాయం కారణంగా బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆస్ట్రేలియా ఆడబోయే తొలి టెస్ట్ నాటికి అతను అందుబాటులోకి వస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ గాయం తగ్గకపోవడంతో ఇక తొలి టెస్ట్ కు అతను దూరంగానే ఉండనున్నాడు అన్నది తెలుస్తుంది.  ఈ విషయాన్ని జట్టు సీనియర్ బాట్స్మన్ స్టీవ్ స్మిత్  తెలిపారు. కామరూన్ గ్రీన్ గైర్హాజరితో ఆస్ట్రేలియాకు ఒక బౌలింగ్ ఆప్షన్ తగ్గనుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక గ్రీన్ స్థానంలో స్పిన్నర్ ను జట్టులోకి తీసుకోబోతున్నారట. కాగా మొదటి టెస్ట్ మ్యాచ్ కు నాగపూర్ ఆతిథ్యం ఇవ్వబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: