ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఇక టి20 వరల్డ్ కప్ జరుగుతుందంటే చాలు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టి మొత్తం అటువైపే ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని చెప్పాలి. ఇక భారత మహిళల జట్టు కూడా పదునైన వ్యూహాలతో బరిలోకి దిగుతూ ప్రత్యర్ధులను చిత్తు చేస్తూ ఉంది.


 ఇక వరుస విజయాలను సాధిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టి20 వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి అయినా పాకిస్తాన్ తో తలబడింది టీం ఇండియా. ఇక ఈ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యాన్ని సాధించిన టీమిండియా జట్టు అటు అద్భుతమైన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఎంతో పటిష్టంగా ఉన్న వెస్టిండీస్ జట్టును కూడా చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. ఇలా వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమ్ ఇండియా నేడు పటిష్టమైన ఇంగ్లాండుతో పోటీ పడబోతుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే అటు పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ మహిళల జట్టు నుంచి భారత ఉమెన్స్ టీం కి కఠినమైన సవాలు ఎదురు కాబోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచిన టీమ్ ఇండియా జట్టు ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టును కూడా ఓడిస్తే దాదాపుగా సెమీఫైనల్ బెర్తు టీమిండియా కు ఖరారు అయినట్లే అవుతుంది. అయితే స్మృతి మందాన, హార్మన్ ప్రీత్ కౌర్, షఫాలి వర్మ, జమీయ రోడ్రిక్స్ రానిస్తే ఇక టీమిండియా కు తిరుగుండదు అని చెప్పాలి.  కాగా సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: