విరాట్ కోహ్లీ ఒక్కసారి మైదానంలో బరిలోకి దిగాడు అంటే చాలు పరుగుల వరద పారించటం ఖాయమని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు. ఇక అతనికి బౌలింగ్ చేస్తే చెత్త రికార్డులు మూటకట్టుకోవడం ఖాయమని స్టార్ బౌలర్లు సైతం భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఎలాంటి వైవిధ్యమైన బంతివేసినా అలవోకగా బౌండరీ తరలించడంలో విరాట్ కోహ్లీ దిట్ట కాబట్టే అతనికి అన్ని రికార్డులు సాధ్యమయ్యయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ వికెట్ ఒక్కసారైనా తీయాలని ప్రతి ఒక్క స్టార్ బౌలర్ భావిస్తూ ఉంటాడు.
అనుకున్నట్లు గానే విరాట్ కోహ్లీ వికెట్ దక్కితే ఇక తమ కెరీర్ కు ఇంతకంటే ఇంకేం కావాలి అని ఆనంద పడిపోతూ ఉంటారు ఎంతో మంది బౌలర్లు. ఇక తనకు కూడా ఇలాంటి ఒక అద్భుతమైన సంఘటన ఎదురైంది అంటూ ఆస్ట్రేలియా యువ బౌలర్ టాడ్ మర్ఫీ అభివర్ణించాడు. కోహ్లీని మూడో సారి అవుట్ చేయడం తన జీవితం లో ఒక అద్భుతమైన సంఘటన అంటూ చెప్పుకొచ్చాడు. నాగపూర్ వేదికగా జరిగిన టెస్టులో కోహ్లీ బ్యాటింగ్ వచ్చేటప్పుడు వికెట్ తీస్తే బాగుంటుందని మనసులో అనుకున్న.. ఇక తాను కోరుకున్నట్లుగానే వికెట్ దక్కింది. దీంతో ఆనందంలో మునిగిపోయాను అంటూ తెలిపాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి