
నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అడుగు పెట్టాలంటే తప్పకుండా నాలుగో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాల్సి ఉంది. ఇక నాలుగో టెస్ట్ అటు స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్ గా పరిగణించబడుతున్న నేపథ్యంలో టీమిండియాలో ఉన్న నలుగురు మొనగాళ్లు వీరే అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.
ఇప్పటికే జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసిన జడేజా కంగారు బ్యాట్స్మెన్లను మరోసారి కంగారు పెట్టబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇప్పటివరకు సిరీస్ అత్యధికంగా 21 వికెట్లు పడగొట్టాడు. అయితే అహ్మదాబాద్ లో మాత్రం ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు. కానీ జడేజా లోకల్ బాయి కావడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లకు చుక్కలు చూపిస్తాడు అని అందరి అంచనా.
ఇక ప్రస్తుతం అశ్విన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు సిరీస్ లో 18 వికెట్లు తీశాడు. ఇక అహ్మదాబాద్ స్టేడియంలో అశ్విన్ రికార్డులు చూసుకుంటే మూడు టెస్ట్ లలో 19 సగటుతో 19 వికెట్లు తీశాడు. ఒక మ్యాచ్లో 49 పరుగుల్లో ఐదు వికెట్లు తీయడం ఈ స్టేడియంలో అతని అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం.
ఈ సిరీస్లో అక్షర్ పటేల్ ఒక వికెట్ మాత్రమే తీశాడు. కానీ బ్యాట్ తో చెలరేగిపోయి రెండు అర్థ సెంచరీలు చేశాడు. ఇక అహ్మదాబాద్లో అతని రికార్డులు చూసుకుంటే రెండు టెస్టుల్లో 9 సగటుతో 20 వికెట్లు తీశాడు. 38 పరుగులకే ఆరు వికెట్లు తీయడం అతని అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం.
మూడో టెస్టులో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా చట్టేశ్వర్ పూజార ఫామ్ లోకి వచ్చాడు. అయితే అహ్మదాబాద్లో అతని ప్రదర్శన చూసుకుంటే.. మూడో టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ లో 172 సగటుతో 264 పరుగులు చేశాడు. ఈ స్టేడియంలోనే 204 పరుగులు చేయడం అతని అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.