
మరి కొంతమంది మ్యాచ్ మధ్యలో చాయ్ తాగడం వల్ల వికెట్లు పడ్డాయని అంతా మా వాళ్లే జరిగింది అంటూ బాధపడిపోతూ ఉంటారు. అయితే ఇలాంటి వారిలో కేవలం సామాన్యులు మాత్రమే కాదండోయ్ ప్రముఖ వ్యాపారవేత ఆనంద్ మహీంద్రా కూడా ఇలాగే ఫీలవుతారు అన్నది మాత్రం ఇటీవలే అర్థమైంది. ఇటీవల ఆనంద్ మహేంద్ర పెట్టిన ఒక పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగానే ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయనకి ఏదైనా ఆసక్తికరంగా అనిపించింది అంటే చాలు నిర్మొహమాటంగా దానిని తన ట్విటర్లో షేర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.
అయితే ఇటీవల భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ గురించి ఆనంద్ మహేంద్ర ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన తక్కువ టార్గెట్ ను టీమిండియా ఈజీగా చేదిస్తుందని ఆనంద్ మహేంద్ర అనుకున్నారట. సిక్సర్లు బౌండరీలు బాదేస్తుంటే ఎంజాయ్ చేయాలని భావించి ఇక నేరుగా మైదానానికి వచ్చారట. కానీ లక్ష్య చేదనలో టీమిండియా 16 పరుగులకే మూడు వికెట్లు చేర్జార్చుకుంది. ఈ క్రమంలోని ఆనందమ మహేంద్ర పోస్ట్ పెడుతూ.. లైవ్ మ్యాచ్ చూసేందుకు వచ్చాను. సిక్సర్లు ఫోర్ లు కొడుతుంటే ఎంజాయ్ చేయాలి అనుకున్న.. కానీ నేను వచ్చినందుకే మూడు వికెట్లు పడ్డాయేమో.. వెంట వెంటనే వికెట్లు పడడానికి నేనే కారణం కాబట్టి వెళ్ళిపోతే బాగుండనిపిస్తుంది అంటూ ఆనంద్ మహేంద్ర ఒక ట్విట్ పెట్టగా అది వైరల్ గా మారింది.