ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే ఆతిథ్య భారత జట్టుతో వరుసగా సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే టెస్టు సిరీస్ ముగించుకున్న ఆస్ట్రేలియా జట్టు ఇక ఇప్పుడు భారత్ తో వన్డే సిరీస్ లో తలబడుతుంది. అయితే 3 వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక రెండో వన్డే మ్యాచ్లో అద్భుతంగా పుంజుకున్న  ఆస్ట్రేలియా ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుని.. సిరీస్ అవకాశాలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది.


 ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్న స్మిత్ సారధ్యంలో కంగారుల జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్లు గాయాల బారిన పడి జట్టుకు దూరమవుతున్నప్పటికీ సొంత గడ్డపైనే భారత జట్టుకు షాక్ ఇచ్చే ప్రదర్శన చేస్తుంది. అయితే నేడు మూడో వన్డే మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. సిరీస్ చేజిక్కించుకోవాలి అంటే ఈ రెండు జట్లకి కూడా మూడో వన్డే మ్యాచ్లో గెలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 కాగా ఇరు జట్ల మధ్య కీలకమైన మూడో వన్డే మ్యాచ్ చెన్నై లోనే చపాక్ స్టేడియంలో జరగబోతుంది.. చివరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని రెండు జట్లు కూడా ఎంతో ఆరాటపడుతూ ఉన్నాయి. అయితే మొదటి మ్యాచ్ లో భారత బ్యాటింగ్ విభాగం పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో ఇక మూడో మ్యాచ్లో పుంజుకుంటుందా లేదా అనే ఆందోళన భారత అభిమానుల్లో ఉంది. ఓపెనర్లు రోహిత్, గిల్ శుభారంభం ఇస్తే టీమిండియా పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉంది. మిచెల్ స్టార్క్ స్వింగ్ ను అటు భారత బ్యాటింగ్ విభాగం ఎలా ఎదుర్కొంటుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: