
ఇకపోతే ఇటీవలే ధోని గురించి సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. మహేంద్ర సింగ్ ధోని కి ఒకప్పుడు పొడవాటి జుట్టు ఉండేది అన్న విషయం తెలిసిందే. అయితే ధోని పొడవాటి జుట్టును చూసి ఇక వీడేం ఆడతాడులే అని అనుకున్నాం అంటూ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించడానికి ముందు ధోని, సురేష్ రైనా క్రికెట్ ప్రత్యర్ధులుగా తలబడ్డారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సురేష్ రైనా సెంట్రల్ జోన్ నుంచి జార్ఖండ్ కు చెందిన ధోని ఈస్ట్ జోన్ నుంచి 2005లో దులిప్ ట్రోఫీలో తొలిసారి తలపడ్డారు.
ఆరోజు జరిగిన ఘటన గురించి గుర్తు చేసుకున్నాడు సురేష్ రైనా. పొడవాటి జుట్టు ఉన్న ఝార్ఖండ్ ఆటగాడు నిలకడగా భారీ సిక్సర్లు బాదుతాడని ధోని గురించి మేము చాలా విన్నాం. అవి మైదానం దాటిపోతాయని ఎంతో గొప్పగా మాట్లాడేవారు. ఓ రోజు ధోని ప్రశాంతంగా మూలకు కూర్చొని రోటి బటర్ చికెన్ తింటున్నాడు. అతన్ని చూసిన మాజీ క్రికెటర్ జ్ఞానేంద్ర పాండే అతను మమ్మల్ని ఇబ్బంది పెడతాడని అనుకోవట్లేదు. ఎందుకంటే అతను చాలా ప్రశాంతంగా తిండిని ఎంజాయ్ చేస్తున్నాడు అని సెటైర్ వేశాడు. కానీ ఆరోజు మ్యాచ్ మొదలైన తర్వాత ధోని ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడూ. దీంతో జ్ఞానేంద్ర పాండే అతని వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు అంటూ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.