అయితే ఇటీవల ఐపీఎల్లో ఆడుతున్న ఒక ఆటగాడిని చూసిన తర్వాత నిజంగానే మనిషిని పోలిన మనుషులు ఉంటారు అనే చర్చ మరోసారి తెరమీదకి వచ్చింది. ఇటీవల కోల్కతా జట్టు హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో 81 పరుగులు తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కోల్కతా జెట్ తరఫున ఆడుతున్న 19 ఏళ్ళ సుయాష్ శర్మ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తన బౌలింగ్ యాక్షన్ తో పాటు తన లుక్స్ కారణంగా సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి.
ఏకంగా సుయాష్ శర్మ ఒలంపిక్ బంగారు పతకం విజేత అయిన జావలిన్ త్రో వీరుడు నీరజ్ చోప్రా లాగే ఉన్నాడు అని చెప్పాలి. కేవలం అతని రూపురేఖలు మాత్రమే కాదు అతని స్టైల్ కూడా నీరజ్ చోప్రా లాగానే ఉండడం గమనార్హం. దీంతో ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులోకి నీరజ్ చోప్రా వచ్చేసాడు అంటూ ఇక ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇకపోతే ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు సూయష్ శర్మ. బెంగళూరు జట్టుతో మ్యాచ్లో సుయాష్ శర్మను కోల్కతా జట్టు ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి చేర్చుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి