ఇది ఒక యానిమేషన్ చిత్రం. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను సోని పిక్చర్ ఎంటర్టైన్మెంట్స్ వారు అత్యంత భారీ హంగులతో ఇండియాలో విడుదల చేయబోతున్నారు. ఇది ఇండియాలోని అనేక భాషల్లో విడుదలవుతుండడం విశేషం. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, పంజాబీ, మరాఠీ, గుజరాతి, బెంగాలీ, మలయాళం, కన్నడ వంటి భాషల్లో అత్యంత అట్టహాసంగా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో శుబ్ మన్ గిల్ స్పైడర్ మాన్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్తూ ఉండడం విశేషం.
ఇక శుబ్ తన గొంతును హిందీ మరియు పంజాబీ భాషల కోసం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల అయింది. జూన్ మొదటి తారీకున ప్రేక్షకుల ముందు వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా శుబ్ మన్ గిల్ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. అంతే కాదు రోడ్డు మీద ఉన్న కారు ఎక్కి తానే స్పైడర్ మాన్ లా ఫోజులిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇటీవల సల్మాన్ ఖాన్ సైతం ఒక హాలీవుడ్ సినిమా కోసం ప్రమోషన్స్ చేయగా అతడి బాటలోనే శుబ్ మన్ గిల్ కూడా స్పైడర్ మాన్ సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తుండడం విశేషం.