ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో యంగ్ ప్లేయర్స్ హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. దేశవాళి క్రికెట్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని.. తమ ప్రతిభ ఏంటో నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ఆట తీరుతో సెలక్టర్లు చూపును ఆకర్షించి అతి తక్కువ సమయంలోనే అటు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంటున్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఎన్నో అరుదైన రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు.


 ఈ క్రమంలోనే భారత యంగ్ సెన్సెషన్ క్రికెటర్ శుభమన్ గిల్ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు వరకు ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు అన్న విషయం తెలిసిందే. ఇలా గిల్ సృష్టించిన రికార్డులలో అతి తక్కువ సమయంలోనే 500 పరుగులను పూర్తి చేయడం కూడా ఒకటి అని చెప్పాలి. వన్డే ఫార్మాట్లో కేవలం 10 వన్డే మ్యాచ్లలోనే 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు గిల్. అయితే ఇక వరల్డ్ క్రికెట్లో ఇదే రెండవ అత్యంత వేగంగా 500 రన్స్ పూర్తి చేసిన రికార్డుగా కొనసాగింది. ఇక ఇప్పుడు గిల్ రికార్డుని మరో యంగ్ క్రికెటర్ బద్దలు కొట్టాడు అని చెప్పాలి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లంక వేదికగా జరుగుతుంది.


 ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తోంది ఆఫ్గనిస్తాన్. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ ఇబ్రహీం  జాద్రాన్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ఏకంగా తొలి వన్డే మ్యాచ్లో 98 పరుగులు చేసి ఇరగదీసాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును కూడా 9 వన్డే మ్యాచ్ లలోనే 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. పది వన్డే ఇన్నింగ్స్ లలో  500 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ రికార్డును బద్దలు కొట్టాడు అని చెప్పాలి. ఈ జాబితాలో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మల్లన్ 7 వన్డే మ్యాచ్లలోనే 500 పరుగులు పూర్తి చేసి ఇక అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన బ్యాట్స్మెన్ గా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: