
ఈ క్రమంలో పాండ్యా చాలా ఈజీగా టెస్టు క్రికెట్‌ను వదిలేశాడని క్లూసెనర్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. చివరగా 2018లో సౌతాంప్టన్ వేదికగా జరిగిన టెస్టులో పాండ్యా ఆడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2018 నుంచి 2021 వరకు వివిధ రకాల శరీర గాయాలతో బాధపడిన పాండ్యా.. ఇటీవలే పునరాగమనం చేశాడు. అయితే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కోసం కేవలం వైట్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. మార్చి నెలలో డబ్ల్యూటీసీ గురించి మాట్లాడుతూ.. తను ఆ జట్టులో ఉండేందుకు ఏం చేయలేదని, కాబట్టి తను ఆడటం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడు.
కాగా, ఇదే విషయంపై క్లూసెనర్‌ను తాజాగా విలేకరులు ప్రశ్నించగా దీనిపై అతగాడు మాట్లాడుతూ.. 'నిజమే.. పాండ్యా చాలా ఈజీగా టెస్టు క్రికెట్‌ను వదిలేశాడు. ఒక క్రికెటర్‌గా మనం ఏంటి? ఈ ఆట పుట్టినప్పటి నుంచి చూసుకున్నా కూడా టెస్టుల్లో పెద్దగా మార్పులు రాలేదు. ప్రస్తుతం టైం మారిపోయింది. పాండ్యా ఒక అద్భుతమైన ప్లేయర్. తను ఫిట్‌గా ఉండి 135+ స్పీడుతో బౌలింగ్ చేస్తే ప్రత్యర్థులకు ఖచ్చితంగా సవాల్‌గా మారగలడు. అతను ప్రపంచంలోని బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఎదుగుతాడు' అని చెప్పాడు. ఇలాంటి ప్లేయర్లు ఏ ఫార్మాట్‌లో అయినా కీలకమే అని ఈ సందర్భంగా తెలిపాడు.