
అయితే టెస్ట్ ఫార్మాట్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు పోరు జరిగిన కూడా అది ఎంతో ఆసక్తికరంగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ రెండు టీమ్స్ చిరకాల ప్రత్యర్ధులు ఏమో అనే విధంగానే ఇక మైదానంలో పోటీ పడుతూ ఉంటాయి. అంతేకాదు ఇక మైదానంలో రెండు జట్ల ఆటగాళ్లు కూడా కవ్వింపులకు పాల్పడటంతో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.
జూన్ ఏడవ తేదీ నుంచి 11వ తేదీ వరకు కూడా ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఇకపోతే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన పోరు తీవ్రంగా ఉండేది. కానీ 2018- 19,2020-21లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఓడించడంతో టీమిండియా అంటే ఆస్ట్రేలియా కు భయం మొదలైంది. ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు తేలిగ్గా తీసుకోవడం లేదు. ఈ విజయాలతో ఒకప్పుడు టీం ఇండియా అని తేలిగ్గా తీసుకున్న ఆసిస్.. ఇప్పుడు గౌరవించడం మొదలుపెట్టింది. వారి సొంత గడ్డపై టీమ్ ఇండియా గట్టి పోటీ ఇస్తుంది అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించారు అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.