అయితే అంతకు ముందు వరకు కూడా ఐపీఎల్ లో సెంచరీలతో చెలరేగిపోయిన గిల్, విరాట్ కోహ్లీలు అదే ఫామ్ ను టెస్ట్ ఫార్మాట్లో మాత్రం చూపించలేకపోయారు. ఇక పరుగులు చేయడానికి ఇబ్బంది పడి తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయి ఇక జట్టుకు భారంగానే మారిపోయారు అని చెప్పాలి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఐదో రోజు ఆటలో అద్భుతంగా రానించి జట్టును గెలిపిస్తాడని 130 కోట్ల మంది భారతీయులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ అందరి ఆశలను నీటిలో పోసిన పన్నీరు గానే మార్చేశాడు విరాట్ కోహ్లీ. అయితే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్న ఇక టీమిండియా ప్రదర్శన పై మాత్రం విమర్శలు వస్తూనే ఉన్నాయ్.
ఇకపోతే ఇదే విషయంపై అటు టీమ్ ఇండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు సునీల్ గావస్కర్. విరాట్ కోహ్లీ అవుట్ అయిన షాట్ పై మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ అడగ్గా.. కోహ్లీ ఆడింది చెత్త షాట్. సాధారణ ప్లేయర్ ఆడే షాట్ అది. కావాలంటే ఈ విషయం కోహ్లీని కూడా అడగండి. కోహ్లీ షాట్ సెలక్షన్ అస్సలు బాలేదు. గెలిచేందుకు లాంగ్ ఇన్నింగ్స్ అవసరం. సెంచరీ ప్లస్ ఇన్నింగ్స్ కావలసిన సమయంలో ఎవరైనా ఇలాంటి షాట్ ఆడతారా అంటూ సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి