బెయిర్‌స్టో వివాదాస్పద ఔట్‌ను బాయ్‌కాట్ ఖండించాడు. ఇది సిగ్గు చేటు చర్య అని.. దీనిపై ఆస్ట్రేలియా జట్టు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. ‘తాము చేసిన దానిపై ఆస్ట్రేలియా జట్టు ఆలోచించుకోవాలి. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదే దీనికి పరిష్కారం. గొప్ప క్రీడా స్ఫూర్తితో వారు అద్భుతమైన క్రికెట్ ఆడారు. అయితే.. ఇలాంటి ఘటనతో దాన్ని నాశనం చేసుకోవడం సిగ్గుచేటు’ అంటూ ఓ మీడియాకు రాసిన వ్యాసంలో బాయ్‌కాట్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా బాయ్‌కాట్ మాట్లాడుతూ క్రికెట్ ని నిజాయితీగా ఆడాలని సూచించాడు. కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించాడు. అంతే కాకుండా ఈ టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటతీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండో టెస్టులో స్టోక్స్ ఒంటరి పోరాటం చేసినా ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఇంకెంత మంది ఈ రన్ అవుట్ గురించి స్పందిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి