ఈ ఏడాది  భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అనే విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో ఇక ఇండియాలో ఎక్కడ చూసినా క్రికెట్ సందడి నెలకొంది. మెల్లమెల్లిగా అన్ని స్టేడియాలు కూడా అటు వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం సిద్ధమవుతున్నాయ్. ఈ క్రమంలోనే ఇక ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా బిసిసిఐ ముందడుగు వేస్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అటు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే.


 ఈ నేపథ్యంలో ప్రతి టీం కి కూడా ఏ మైదానంలో.. ఏ ప్రత్యర్థిని.. ఏ రోజు ఎదుర్కోబోతున్నాము అనే విషయంపై ఒక క్లారిటీ ఉంది అని చెప్పాలి. ఇందుకు అనుగుణంగానే అన్ని జట్లు కూడా వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇక ఇటీవల ఐసీసీ ప్రకటించిన వరల్డ్ కప్ షెడ్యూల్ చూసుకుంటే.. కొన్ని మైదానాలలో కీలకమైన మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే కీలకమైన మ్యాచ్లకు వేదికగా మారిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వద్ద ఫైవ్ స్టార్ హోటల్ యాజమాన్యాలు ఒక్కసారిగా అద్దె రేట్లు పెంచారు అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ లో కూడా వరల్డ్ మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఇక వరల్డ్ కప్ కి ఉన్న క్రేజ్ దృశ్య స్టేడియం నిర్వహికులు ఒక్కసారిగా టికెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అప్పర్ క్లాస్ టికెట్ ధర 900.. డి,హెచ్ బ్లాక్ ల టికెట్ల ధరలు 1500.. సి,కె బ్లాకులు 2500,   బి, ఎల్ బ్లాక్ ల టికెట్ ధరలు 3000 రూపాయలుగా టికెట్ రేట్లను నిర్ణయించారు నిర్వాహకులు. అయితే ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తో పాటు సెమి ఫైనల్ మ్యాచ్ లు కూడా జరగనున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc