బుమ్రా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యార్కర్స్ వేస్తూ బ్యాట్స్ మెన్ ని ఇబ్బంది పెడుతుంటాడు. డెత్ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్ వేస్తూ పరుగులు రాకుండా కట్టడి చేయడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టుకు విజయాలు అందిస్తుంటాడు. అయితే కొన్ని నెలలుగా బుమ్రా గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. కోలుకున్న బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఐర్లాండ్ సిరీస్ తో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. నెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. త్వరలోనే జరగనున్న ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లలో బుమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బుమ్రా గురించి మరో విషయం ట్రెండ్ అవుతుంది. బుమ్రా గాయానికి శృంగారం కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతుంది.

గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడ్డ బుమ్రా ఆ తరువాత ఏడాదిపాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఫిట్ నెస్ సాధించి తిరిగి జట్టులోకి వచ్చాడు బుమ్రా. వచ్చి రాగానే బుమ్రాకు సారధిగాను పగ్గాలు అప్పగించింది. ఐర్లాండ్ సిరీస్ కు కెప్టెన్ గా వచ్చిన బుమ్రా ప్రాక్టీస్ మరింత పెంచాడు. నెట్స్ లో చెమటలు కక్కిస్తున్నాడు. బ్యాట్స్ మెన్ ను తన యార్కర్ లతో వణికిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతని గాయానికి కారణం ఏంటనే చర్చ జోరుగా చర్చ జరుగుతుంది.

కొందరు తన విలక్షణ బౌలింగ్ శైలి కారణం అని చెబుతుంటే కొందరు మాత్రం బుమ్రా గాయానికి శృంగారం కారణమని ఆరోపిస్తున్నారు. గాయం కారణంగా రెస్ట్ లో ఉన్న బుమ్రా భార్యతో శృంగారంలో పాల్గొనడంతోనే సమస్య పెద్దగా అయ్యిందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

ఇక ఈ ఐర్లాండ్ సిరీస్ లో బుమ్రా ఎలా రాణిస్తాడు అన్నది చాలా కీలకంగా మారింది. బౌలింగ్ లోనే కాదు కెప్టెన్ గా కూడా బుమ్రాపై ఒత్తిడి ఉంటుంది. మరి బుమ్రా తన జట్టును ఎలా ముందుండి నడిపిస్తాడో చూడాలి. గాయాల కారణంగా జట్టుకు దూరమైన రాహుల్, అయ్యర్ కూడా ఈ సిరీస్ తోనే జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వీరందరికి ఈ సిరీస్ చాలా కీలకం.

మరింత సమాచారం తెలుసుకోండి: