సన్రైజర్స్ హైదరాబాద్ 2024 ఐపిఎల్ సీజన్లో టైటిల్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే  జట్టును ప్రక్షాళన చేసేందుకు నిర్ణయించుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన హరి బ్రూక్ ని  సైతం వదులుకునేందుకు సిద్ధమైంది. అయితే ఇలా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వేలంలోకి రిలీజ్ చేసేందుకు సిద్ధమైన ఆటగాడు.. ఇటీవల ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఏకంగా మెరుపు ఇన్నింగ్స్ ఆడి సెంచరీ తో చెందరేపోయాడు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న 100 లీగ్ లో భాగంగా నార్థన్ సూపర్ ఛార్జర్స్ తరఫున ఆడుతూ ఉన్నాడు హరి బ్రూక్స్. ఇక ఇటీవల ఫాస్టెస్ట్ సెంచరీ చేసి అరుదైన రికార్డు సృష్టించాడు. అతని బ్యాటింగ్ దాటికి బౌలర్లు బెంబేలెత్తిపోయారు  అని చెప్పాలి. ఏ బౌలర్ వచ్చిన సిక్సర్లు ఫోర్ లతో స్వాగతం పలికాడు హరి బ్రూక్స్. ఈ క్రమంలోనే 41 బంతుల్లో సెంచరీ చేసి అదిరిపోయే ప్రదర్శన చేశాడు. అయితే 41 బంతులోనే 105 పరుగులు చేసిన బ్లూక్స్ తర్వాత బంతికే పెవిలియన్ చేరాడు. మొత్తంగా 42 బంతుల్లో 11 ఫోర్లు 7 సిక్సర్ల సహాయంతో 105 పరుగులు చేశాడు.


 ఇక అతను బ్యాటింగ్ తో చెలరేగిపోవడంతో సూపర్ ఛార్జర్స్ 100 బంతుల్లో ఏడు వికెట్లకు 158 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనకు  దిగిన వైల్డ్ ఫైర్ జట్టు 90 బంతుల్లోనే రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 159 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో బ్రూక్ సెంచరీ వృధాగా మారింది. అయితే ఇలా సెంచరీ చేసి ప్రత్యర్థి బౌలర్లను గడగడలాడించిన ఈ ఆటగాడిని.. ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ వదులుకునేందుకు సిద్ధమైంది. ఎందుకంటే అతన్ని భారీ ధర పెట్టి కొనుగోలు చేస్తే.. ఈ ఏడాది  జరిగిన ఐపీఎల్ లీగ్ లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 100 లీగ్ లో సైతం ఈ ఒక్క సెంచరీ మినహా మిగతా మ్యాచ్లలో సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl