
ఈ క్రమంలోనే రెండు పటిష్టమైన టీమ్స్ తలబడుతూ ఉండడం.. అది కూడా వరల్డ్ కప్ కి ముందు జరుగుతున్న మ్యాచ్ కావడంతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా, భారత్ ఎప్పుడు తలపడిన కూడా ఇక పోరు హోరాహోరీ గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగానే చివరి వరకు మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు వన్డే ఫార్మాట్లో ఈ రెండు టీమ్స్ మధ్య సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో పాత గణాంకాలు ఎలా ఉన్నాయి అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే ఒకసారి పాత గణాంకాలు చూసుకుంటే.. వన్డే ఫార్మాట్లో టీమ్ ఇండియా పై ఆస్ట్రేలియా ఆదిపత్యం కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 146 వన్డే మ్యాచ్లు జరిగాయి. అయితే వీటిలో ఆస్ట్రేలియా 82 మ్యాచ్లలో విజయం సాధిస్తే.. భారత్ కేవలం 54 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. మరో 10 మ్యాచ్లు ఫలితం తేలలేదు. అయితే భారత్ వేదికగా ఇరు జట్లు కూడా 67 సార్లు తలపడగా.. కంగారులు 32 సార్లు విజయం సాధిస్తే.. టీమ్ ఇండియా 30 సార్లు విజయం సాధించింది అని చెప్పాలి. ఐదు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ఇలా మొత్తంగా భారత్ పై ఆస్ట్రేలియాదే పైచేయి ఉంది. మరి ఆసియా కప్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాపై ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.