
కాగా ప్రస్తుతం భారత జట్టు ప్రదర్శన తీరు చూసిన తర్వాత ఇక సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా తప్పకుండా వరల్డ్ కప్ గెలిచి విశ్వవిజేతగా నిలుస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఇటీవలే భారత మాజీ ఆటగాడు టీమ్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇలా అయితే వరల్డ్ కప్ గెలవడం కష్టమే అంటూ అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా విజయం సాధించినప్పటికీ భారత జట్టులోని ఒక లోపం మాత్రం కొట్టొచ్చునట్లు కనిపించింది. బౌలింగ్ బ్యాటింగ్లో పటిష్టంగా ఉన్న టీమిండియా ఫీల్డింగ్ లో మాత్రం తేలిపోతుంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ఇక ఇలాంటి వైఫల్యాలు చాలానే కనిపించాయి. ఈ క్రమంలోనే ఇది చూసిన టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్.. భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. టీమిండియా క్యాచ్ లు పట్టకపోతే ప్రపంచకప్ కూడా చేజారిపోతుంది బ్యాటింగ్ బౌలింగ్ ద్వారా మ్యాచ్ గెలవచ్చు. కానీ క్యాచింగ్ కూడా చాలా ముఖ్యం అంటూ ఈ మాజీ ప్లేయర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ తో పాటు ఇషాన్ కిషన్ రవీంద్ర జడేజా చెత్త ఫీల్డింగ్ తో నిరాశపరిచారూ.