
కానీ అధికారిక మ్యాచ్ లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక జట్టు ఎంపికలో చిన్న మార్పులు చేర్పులు చేసింది ఆల్ రౌండర్ అక్షర పటేల్ గాయం బారిన పడటంతో అతని స్థానంలో ఎంతో అనుభవజ్ఞుడైన రవిచంద్రన్ అశ్విన్ ను ఎంపిక చేసింది భారత జట్టు యాజమాన్యం. అశ్విన్ ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో తన స్పిన్ మాయాజాలం తో సత్తా చాటెందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఇక అశ్విన్ అద్భుతంగా రానిస్తాడని అభిమానులు అనుకుంటున్న వేళ.. ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.
తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి ఈ ఏడాది జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ తనకు చివరి వరల్డ్ కప్ కావచ్చు అంటూ వ్యాఖ్యానించాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే వరల్డ్ కప్ ను ఆస్వాదించడమే తనకు ఎంతో ముఖ్యం అంటూ తెలిపాడు. అయితే ఆలస్యంగా జట్టులోకి ఎంపిక కావడం గురించి తాను ఆలోచించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నాడు అన్నది తెలుస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి వన్డే ఫార్మర్ కు అశ్విన్ దూరంగానే ఉంటున్నాడు. దీంతో ఇప్పుడు అతను ప్రపంచ కప్ లో ఎలా రాణించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.