అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా టైటిల్ పై ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఎందుకంటే సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో టీమిండియాకు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పాలి. దీంతో పుష్కరకాలం తర్వాత ఇప్పుడు టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలిచేందుకు ఒక మంచి అవకాశం లభించింది అని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే అక్టోబర్ 5వ తేదీ నుంచి టోర్నీ ప్రారంభం కాబోతుండగా అక్టోబర్ 8వ తేదీన భారత్ జట్టు తొలి మ్యాచ్ ఆడబోతుంది.


 పటిష్టమైన ఆస్ట్రేలియా తో తలబడబోతుంది అని చెప్పాలి. అయితే ఇరు జట్లు కూడా అటు పటిష్టమైన టీమ్స్ కావడంతో హోరా హోరు  పోరు జరగడం ఖాయమని అటు క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల అష్టన్ ఆగర్ గాయపడటంతో అతని స్థానంలో మార్నస్ లభిషేన్ ను తుది జట్టులోకి తీసుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. అయితే ఇటీవల మార్నస్ లబుషేన్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎక్కువ రిస్క్ తీసుకోకుండానే భారీగా పరుగులు చేయగలడు అంటూ చెప్పుకొచ్చాడు.


 ఒకసారి రోహిత్ చెలరేగితే అతడిని ఆపడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల తమతో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ మంచి స్కోర్ సాధించాడని.. ఇక రాబోయే వరల్డ్ కప్ లో భారత జట్టుకు ఇది శుభ పరిణామం అంటూ లభూషెణ్ తెలిపాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తమ దేశ పర్యటనకు  భారత జట్టు వచ్చిన సమయంలో రోహిత్ ను దగ్గర నుంచి చూస్తూ అతని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటూ లబుషేన్ చెప్పకోచ్చాడు. అయితే వరల్డ్ కప్ సహా అంతకు ముందు జరిగిన ఆసియా కప్ లో కూడా మంచి ఫామ్ కనబరిచిన రోహిత్ శర్మ.. ఇక ఇప్పుడు సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో కూడా సత్తా చాటి అదిరిపోయే ప్రదర్శనలు చేయడం ఖాయమని ఎంతోమంది ఫాన్స్ భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: