ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఎప్పుడు తన బౌలింగ్లో నిప్పులు చెరుగుతూ ప్రత్యర్థులను భయపెడుతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం సరైన ఫామ్ కనబరచలేక ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్లో అతను మళ్లీ మొన్నటి ఫామ్ ను అందుకున్నాను అన్న విషయాన్ని నిరూపించాడు. 2015, 2019 వరల్డ్ కప్ లో ఎలా అయితే బీస్ట్ లాగా చిలరేగిపోయాడో.. ఇక ఇప్పుడు మరోసారి మిచెల్ స్టార్క్ అదే రీతిలో అదరగొడుతున్నాడు. 2023 ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవలే నెదర్లాండ్స్ తో ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ ఆడింది.


 ఇక ఈ మ్యాచ్ లో ఏకంగా హ్యాట్రిక్ వికెట్లతో మెరిసాడు మిచెల్ స్టార్క్. అయితే ఈ హ్యాట్రిక్ అంతర్జాతీయ లెక్కల్లోకి రాకపోయినప్పటికీ ఇక  స్టార్క్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని.. అతనితో జాగ్రత్తగా ఉండాలని ప్రత్యర్థులకు అర్థమయ్యేలా చేసింది. అయితే అతను సాధించిన మూడు వికెట్లు కూడా బ్యాట్స్మెన్ లకు డకౌట్లే కావడం గమనార్హం. అయితే ఎంతో ఉత్కంఠ గా సాగుతున్న మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించింది అని చెప్పాలి.


 అప్పటికే వర్షం కురవడంతో ఇక మ్యాచ్ ఐదు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. అంపైర్లు మ్యాచ్ ని 23 ఓవర్లకి కుదించారు. అయితే టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనలో నెదర్లాండ్స్  14.2 ఓవర్లు ఆరు వికెట్లకు 84 పరుగులు చేసింది. అయితే అనంతరం వర్షం కురవడంతో చివరికి మ్యాచ్ను రద్దు చేశారు అంపైర్లు. అయితే ఈ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ సాధించిన హ్యాట్రిక్  వికెట్లు మాత్రం ప్రస్తుతం చర్చకు వచ్చాయి అని చెప్పాలి. అయితే ఇది మాత్రమే కాదు మరోవైపు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వార్మఫ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: