ఇప్పటికే టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ గిల్ డెంగ్యూ బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే మొదటి మ్యాచ్ వరకు అతను కోలుకుంటాడా లేదా అన్నది అనుమానం గానే మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక గిల్ లాంటి కీలక ప్లేయర్ దూరం కావడంతో అభిమానులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో రేపే ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఇటీవల టీం ఇండియాకు మరో భారీ షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా గాయం బారిన పడ్డాడట.
ప్రస్తుతం వరల్డ్ కప్ ముంగిట అటు భారత ఆటగాళ్లు అందరూ కూడా ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం బారిన పడ్డాడు సిరాజ్ వేసిన ఓ బౌన్సర్ పాండ్యా వేలికి బలంగా తగిలింది అన్నది తెలుస్తోంది. దీంతో అతడు నెట్స్ నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. అయితే ఆస్ట్రేలియా తో మ్యాచ్ జరిగే సమయానికి పాండ్య కోలుకోకపోతే మాత్రం అది టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. కాగా ప్రస్తుతం హార్దిక్ పాండ్యా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి