సెమీఫైనల్ లో ప్రతిష్టమైన దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్ లో అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. ఈ క్రమంలోనే అలాంటి ఆస్ట్రేలియా ఆటలు కట్టించేందుకు అటు భారత జట్టు వ్యూహాలు రచించడంలో మునిగిపోయింది అని చెప్పాలి. ఇక మరోవైపు సొంత గడ్డపై పటిష్టమైన జట్టుగా ఉన్న టీమిండియా ఇక సమిష్టిగా రాణిస్తూ అటు ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్థానం కొనసాగిస్తుంది. దీంతో ఇక సొంత గడ్డపై భారత్ ను దెబ్బకొట్టేందుకు కూడా అటు ఆస్ట్రేలియా ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంది అని చెప్పాలి. కాగా భారత జట్టులో బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను అందరు ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు వరకు వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఫైనల్ వరకు చేరని టీమిండియాను ఎలా కట్టడి చేయాలో అని ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందరు కూడా తలలు బద్దలు కొట్టుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఆసీస్ కెప్టెన్ కమిన్స్ చేసిన కామెంట్స్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. రోహిత్ సేన ఈ టోర్నమెంట్లో కలిసికట్టుగా రాణిస్తుంది. అయితే తమ జట్టును బాగా కలవర పెడుతుంది మాత్రం భారత బౌలర్ మహమ్మద్ షమీనే. ఇక అతని ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కావట్లేదు. అతని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు కమిన్స్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి