2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి అన్ని సలహాలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబర్ 19వ తేదీన మినీ వేలం ప్రక్రియ కూడా జరగబోతుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు కూడా తమతో పాటు అంటిపెట్టుకొనే ఆటగాళ్ల వివరాలతో పాటు ఇక వేలంలోకి వదిలేసే ప్లేయర్స్ డీటెయిల్స్ అన్ని కూడా సమర్పించాయి. ఈ క్రమంలోనే కొన్ని టీమ్స్ ఏకంగా కీలకమైన స్టార్ ప్లేయర్లను వదులుకునేందుకు కూడా రెడీ అయ్యాయి అని చెప్పాలి.


 ఇలాంటి సమయంలో ఒక ఆటగాడి గురించి చర్చ మాత్రం తీవ్రంగా జరుగుతుంది.  గుజరాత్ కెప్టెన్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా ఏకంగా ముంబై ఇండియన్స్ వదిలేసిన సమయంలో గుజరాత్ టీం అతన్ని జట్టులో చేర్చుకొని కెప్టెన్సీ ఇచ్చింది. ఇక గుజరాత్ కెప్టెన్సీ దక్కడం కారణంగానే అతను టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అనే ట్యాగ్ ను కూడా సొంతం చేసుకోగలిగాడు అని చెప్పాలి. ఇప్పుడు హార్దిక్ ఏకంగా గుజరాత్ జట్టును పక్కకు పెట్టి మళ్ళీ పాత టీమైన ముంబైలోకి వచ్చేందుకు రెడీ అయ్యాడు. ముంబై ఏకంగా అతనికి 15 కోట్లు చెల్లించి జట్టులోకీ తీసుకుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇదే విషయం పై అంతటా చర్చ జరుగుతుంది. కాగా గుజరాత్ను వీడి మళ్లీ ముంబై జట్టు లోకి చేరిన హార్థిక్ పాండ్యా.  ఇటీవల ఒక ఎమోషనల్ నోట్ ని విడుదల చేశాడు  గుజరాత్ టైటాన్స్ మేనేజ్మెంట్ టీం ఫ్యాన్స్ కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. జట్టు లో భాగమైనందుకు కెప్టెన్ గా ఉన్నందుకు గర్వపడుతున్న. ఒక ప్లేయర్గా వ్యక్తిగా నాపై ప్రేమ చూపించినందుకు ఎంతో ధన్యవాదాలు. గుజరాత్ టైటాన్స్ తో పంచుకున్న అనుభవాలు జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. ఇది మర్చిపోలేని ప్రయాణం అంటూ హార్దిక్ పాండ్యా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl