బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా దేశీయ టి20 లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్.. ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్లో ప్రతి సీజన్లో కూడా స్వదేశీ క్రికెటర్లు మాత్రమే కాదు విదేశీ క్రికెటర్లు కూడా పాల్గొనడానికి ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఐపీఎల్ లో పాల్గొంటే భారీగా ఆదాయంతో పాటు మరోవైపు పేరు ఇంకోవైపు అనుభవం కూడా వస్తుంది.


 దీంతో ఈ ప్రతిష్టాత్మకమైన టి20 టోర్నీని మిస్ చేసుకునేందుకు ఏ ఆటగాళ్లు ఇష్టపడరు అని చెప్పాలి. కొంతమంది క్రికెటర్లు అయితే ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు పక్కన పెట్టి మరి ఐపీఎల్లో భాగం కావాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే ఇలా కోరుకున్న ప్లేయర్స్ అందరూ కూడా ఐపీఎల్ ఆడటం చేస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్ ప్లేయర్లకు ఇలాంటి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది. దీంతో పాకిస్తాన్ ఈ వీడియో మధ్య కనీసం ద్వైపాక్షిక సిరీస్ లు కూడా జరగవు. అలాంటిది ఇక పాకిస్తాన్ క్రికెటర్లు ఐపీఎల్ లో పాల్గొనడం ఎలా జరుగుతుంది.


 దీంతో ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ.. పాక్ ఆటగాళ్ళకు అది సాధ్యపడదు. అయితే ఐపీఎల్ పై తనకు ఉన్న ఇష్టాన్ని ఇటీవల పాకిస్తాన్ ఫేస్ బౌలర్ హసన్ అలీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్.. ఏ క్రికెటర్ అయినా సరే అందులో క్రికెట్ ఆడాలని కోరుకుంటారు. నాకు కూడా ఐపీఎల్ ఆడాలని ఉంది. ఒకవేళ నాకు అవకాశం వస్తే తప్పకుండా ఆ టోర్నీలో భాగం అవుతాను అంటూ హసన్ అలీ వ్యాఖ్యానించాడు. ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ క్రికెటర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. కాగా ఐపీఎల్ తరహాలోనే పాక్ క్రికెట్ బోర్డు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ అనే ఒక టి20 టోర్నీ నిర్వహిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: