ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది అంటే చాలు క్రికెట్ పండుగ మొదలవుతూ ఉంటుంది. ఇక నెలన్నర రోజుల పాటు ఈ క్రికెట్ పండుగను ఈ ప్రేక్షకులందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు  అయితే ఇప్పటికే 2023 ఐపీఎల్ సీజన్ ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అయితే డిసెంబర్ 19వ తేదీన మినీ వేలం ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఈ వేలంలో ఏ ఆటగాడు ఎంత ధర పలకబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే మినీ వేలం జరగడానికి ముందే ఎన్నో టీమ్స్ తమకు కావాల్సిన ప్లేయర్లను జట్టులోకి తీసుకుంటూ ఉండటం గమనార్హం.


 ఇతర టీమ్స్ వేలంలోకి వదిలేసిన ఆటగాళ్లు తమ జట్టుకు ఉపయోగపడతారు అనుకుంటే ఇక వారికి భారీ ధర చెల్లించి మరియు ఏకంగా జట్టులోకి తీసుకుంటున్నాయి మిగతా ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక కీలకమైన ఆల్ రౌండర్ ని జట్టులోకి తీసుకుంది. దీంతో ఇదే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్  మారిపోయింది అని చెప్పాలి. ఆస్ట్రేలియా జట్టు తరఫున యువ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న కామరూన్ గ్రీన్ ను భారీ ధర పెట్టి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అతను మంచి ప్రదర్శన చేశాడు .


 ఇక 2024 ఐపీఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ కి బాగా అచ్చోచ్చిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య జట్టులోకి వచ్చి చేరడంతో.. ఇక కామరూన్ గ్రీన్ వదిలేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక అతన్ని తమ జట్టులోకి తీసుకుంది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఆర్సిబి జట్టుకి ఐపీఎల్ టైటిల్ గెలవడం అనేది కలగానే మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఈ కీలక ఆటగాడి రాకతో ఆర్ సి బి అదృష్టం ఏమైనా మారుతుందా లేదా అన్న చర్చ జరుగుతుంది. కాగా ఐపీఎల్లో 16 మ్యాచ్ లు ఆడిన ఈ స్టార్ ఆల్ రౌండర్ ఏకంగా 452 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl