ఇండియా వేదికగా అక్టోబర్ 5వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వరల్డ్ కప్ టోర్నీ ముగిసింది. అయితే ఈ ప్రపంచ కప్ సొంత గడ్డమీద జరుగుతూ ఉండడంతో.. టీమ్ ఇండియాకు తిరుగు ఉండదు అని అందరూ భావించారు. ఈ క్రమంలోనే 2011 తర్వాత భారత జట్టుకు అందని ద్రాక్షల ఉన్న వరల్డ్ కప్ టైటిల్ ను ఇక ఇప్పుడు సొంత గడ్డమీద జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియా సొంతం చేసుకోవడం ఖాయమని అందరూ అంచనా వేశారు. అనుకున్నట్లుగానే టీమ్ ఇండియా వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్ వరకు చేరుకుంది. కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.


 అయితే ఈ ఓటమితో భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నాయి. కానీ ఇక ఈ మ్యాచ్ కు సంబంధించిన చర్చ మాత్రం అస్సలు ఆగడం లేదు. అయితే వరల్డ్ కప్ ఓటమి తర్వాత బాధలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్ కు మద్దతుగా నిలిచిన మాజీలు ఆ తర్వాత మాత్రం భారత ఆటగాళ్లు చేసిన చెత్త ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు కోచ్ ద్రవిడ్ కోసం కప్పు గెలుస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్  షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 రోహిత్ శర్మ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మీరు దేశం కోసం కప్ గెలవాలి.. ఎవరో ఒకరి కోసం కాదు. ఒకవేళ మీకు అలాంటి అభిప్రాయాలు ఉంటే.. మదిలో ఉంచుకోవాలి మీడియా ముందు చెప్పకూడదు. 2011 వరల్డ్ కప్ సమయంలో నన్ను సచిన్ కోసం వరల్డ్ కప్ గెలుస్తాము అని చెప్పమన్నారు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. దేశం కోసం వరల్డ్ కప్ గెలుస్తాము అని చెప్పాను అంటూ గౌతమ్ గంభీర్ గుర్తు చేసుకున్నాడు. కాగా గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్స్  ప్రస్తుతం సంచలనగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: