ఇండియా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ టోర్నీ ఎప్పుడైతే ముగిసిందో.. అప్పటినుంచి భారత క్రికెట్లో ఒక కొత్త చర్చకు తెరలేచింది అన్న విషయం తెలిసిందే. అదే భారత హెడ్ కోచ్ పదవి గురించి. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ గా కొనసాగుతున్న భారత క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ కోచ్ కాంట్రాక్ట్ పదవి కాలం ముగిసింది. దీంతో ఇక తర్వాత భారత జట్టుకు ప్రధాన కోచ్గా రాబోయేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే రాహుల్ ద్రావిడ్ మరోసారి కోచ్గా బాధ్యతలు చేపడితే బాగుంటుందని అందరూ అభిప్రాయపడ్డారు.


 కానీ ఇక మరోసారి భారత జట్టు హెడ్ కోచ్గా ఉండేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడు అన్న వార్తలు కూడా తెరమీదికి వచ్చాయి అని చెప్పాలి. దీంతో టీమిండియా కు కొత్త హెడ్ కోచ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ కూడా చర్చించుకున్నారు. నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్న వివిఎస్ లక్ష్మణ్ ఇక భారత జట్టుకు కొత్త ప్రధాన కోచ్ గా మారబోతున్నాడు అని కొంతమంది చర్చించుకున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో అటు మరోసారి రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నాడు అంటూ బీసీసీఐ ప్రకటన చేసింది.


 ఇక బిసిసిఐ చేసిన ఈ ప్రకటనతో భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ ద్రవిడ్ మరోసారి హెడ్ కోచ్ గా ఉండడం నిజంగా గొప్ప విషయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఈ విషయంలో రాహుల్ ద్రావిడ్ ట్విస్ట్ ఇచ్చాడు అన్నది తెలుస్తుంది. తాను ఇంకా కాంట్రాక్ట్ పేపర్లపై ఎలాంటి సంతకాలు చేయలేదని.. చర్చలు మాత్రం జరిగాయని ద్రవిడ్ పేర్కొన్నట్లు  క్రీడ వర్గాల నుంచి సమాచారం. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన మాత్రమే కాదు.. ఇక చర్చలు సఫలమై కాంట్రాక్ట్ మీద సంతకం చేసినప్పుడు చూద్దాం అని రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడట. ఇక ఈ విషయం తెలిసి ఇదెక్కడి ట్విస్ట్ బాసు.. అంతా అయిపోయింది అనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చింది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: