ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రస్థానం మొదలుపెట్టిన కేవలం రెండు సీజన్స్ లోనే ఛాంపియన్ టీం అనే ఒక ప్రత్యేకమైన హోదానుకు సొంతం చేసుకుంది గుజరాత్ టైటాన్స్ జట్టు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. మొదటి ప్రయత్నంలోనే ఐపిఎల్ టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏళ్ల చరిత్ర కలిగిన మహా మహా టీమ్స్ కి సైతం సాధ్యం కానీ ఐపీఎల్ టైటిల్ను అటు గుజరాత్ మొదటి ప్రయత్నంలోనే ఎగరేసుకుపోవడంతో అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి.


 ఇక ఆ తర్వాత సీజన్లోనూ అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. ఏకంగా ఫైనల్ వరకు వెళ్ళింది రన్నరప్ తో సరిపెట్టుకుంది. అయితే ఇక 2024 ఐపీఎల్ సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టులో అనూహ్యమైన మార్పులు జరిగాయి  జట్టు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా తన పాత టీం అయినా ముంబైలోకి వెళ్లిపోయాడు. దీంతో గుజరాత్ జట్టుకి కొత్త కెప్టెన్ అవసరం పడింది. అయితే జట్టులో ఉన్న సీనియర్ కేన్ విలియమ్సన్ కి సారధ్య బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని అందరు అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో భారత యంగ్ ఓపెనర్ గిల్ చేతికి కెప్టెన్సీ వచ్చింది.


 ఇక అతను ఎంత మేరకు జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇలా యంగ్ బ్యాటర్ గిల్ కి కెప్టెన్సీ ఇవ్వడంపై ఎబి డివిలియర్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ కు కెప్టెన్సీ ఇస్తూ గుజరాత్ టైటాన్స్ తొందరపడింది అంటూ అభిప్రాయపడ్డాడు. అనుభవజ్ఞుడు విలియంసన్ ఉండగా.. గిల్ కు కెప్టెన్సీ ఇవ్వడం సరైనది కాదు. గిల్ నేర్చుకునే దశలోనే ఉన్నాడు. కేన్ ను రిటైన్ చేసుకోవడంతో అతడినే కెప్టెన్ చేస్తారనుకున్న గిల్ కు మరో సీజన్ తర్వాత కెప్టెన్సీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా ఇక అతను బాగా రాణించాలని కోరుకుంటున్నా అంటూ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl