సొంత గడ్డమీద జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించిన టీమిండియా ఫైనల్ పోరులో మాత్రం గెలవలేకపోయింది. ఫైనల్  లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఇక వరల్డ్ కప్ టైటిల్ గెలవలేక నిరాశలో మునిగిపోయింది. అయితే ఇక ఇప్పుడు 2024 టీ20 వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది టీమిండియా. అంతా బాగానే ఉంది. కానీ ఇక భారత జట్టులో సీనియర్లుగా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీలు టి20 ఫార్మాట్లోకి వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఇద్దరు సీనియర్ ప్లేయర్లు టి20 ఫార్మాట్ కి పూర్తిగా దూరంగానే ఉంటున్నారు. దీంతో హార్దిక్ పాండ్యాను తాత్కాలిక కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ అన్ని టి20 సిరీస్ లు ఆడిస్తోంది. అయితే రాబోయే వరల్డ్ కప్ నాటికి ఇద్దరు మళ్ళీ టి20 ఫార్మాట్ లోకి వస్తారా లేదంటే హార్దిక్ పాండ్యానే ఇక అప్పటిలోపు పూర్తిస్థాయి కెప్టెన్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే కోహ్లీ, రోహిత్ లాంటి అనుభవజ్ఞులు టి20 ఫార్మాట్లో వరల్డ్ కప్ జట్టులో ఉంటేనే బాగుంటుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది అన్నది తెలుస్తుంది. 2024 t20 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ కప్ లో భారత జట్టు కెప్టెన్గా హిట్ మాన్ వ్యవహరిస్తాడు అంటూ పేర్కొన్నాయ్ భారత క్రికెట్ వర్గాలు. సౌత్ ఆఫ్రికా తో జరగనున్న టి20, వన్ డే సిరీస్ లలో తమకు రెస్ట్ ఇవ్వాల్సిందిగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కోరినట్లు బిసిసిఐ ప్రకటన చేసింది  అన్న విషయం తెలిసిందే. కేవలం టెస్టు సిరీస్ కు మాత్రమే ప్రస్తుతం ఈ ఇద్దరు సీనియర్లు అందుబాటులో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: