ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు అద్భుతమైన ప్రస్థానాన్ని  కొనసాగించింది అని చెప్పాలి. మొదటి మ్యాచ్ నుంచి ప్రత్యర్థులపై పూర్తి ఆదిపత్యం చలా ఇస్తూ వరుస విజయాలతో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే సెమీఫైనల్ వరకు ఏకంగా 10 మ్యాచ్లు ఆడిన భారత జట్టు ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించకపోవడం గమనార్హం.  ఇక టీమ్ ఇండియా దూకుడు చూస్తే తప్పకుండా ఫైనల్లో కూడా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు.


 కేవలం భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా ఇది నమ్మారు. కానీ ఊహించని రీతిలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఫలితం వచ్చింది. ఏకంగా ఆస్ట్రేలియా జట్టు టీం ఇండియా పై విజయం సాధించింది. అప్పటివరకు వరల్డ్ కప్ లో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగించిన ఆస్ట్రేలియా ఇక ఫైనల్ లో మాత్రం తమకు ఉన్న అనుభవాన్ని మొత్తం చూపించి టీమ్ ఇండియాపై పైచేయి సాధించింది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మను కోచ్ రాహుల్ ద్రావిడ్ ను అటు వరల్డ్ కప్ ఓటమిపై బీసీసీఐ వివరణ అడిగింది.


 అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోవడానికి పిచ్ టర్న్ అవ్వకపోవడమే కారణం అంటూ కోచ్ రాహుల్ ద్రవిడ్ బీసీసీఐకి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో అనుకున్నంతగా పిచ్ టర్న్ అవ్వలేదని.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కూడా ఓటమికి కారణం అయ్యింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు వాడిన పిచ్ నే ఫైనల్ కు వాడారని ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటింగ్ సాగినట్లుగానే ఇక ఫైనల్లో ఇండియా బ్యాటింగ్ సాగిందని కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: