వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీగా ఉంది. ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన కేవలం రోజుల వ్యవధిలోనే టీమిండియా అటు ఆస్ట్రేలియా తో టి20 సిరీస్ ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సిరీస్ ముగిసిన వెంటనే సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లబోతుంది టీమిండియా. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్ లు ఆడబోతుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా గడ్డపై ఉండే బౌన్సీ పిచ్ లపై సౌత్ ఆఫ్రికా బౌలర్ల బౌన్సర్లను టీమిండియా బ్యాట్స్మెన్లు ఎలా ఎదుర్కోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక మూడు ఫార్మాట్లలో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడబోయే జట్టు వివరాలను ఇటీవల బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. టి20 ఫార్మాట్ కు కెప్టెన్ గా సూర్య కుమార్ వన్డే ఫార్మాట్కు కెప్టెన్గా కేఎల్ రాహుల్.. ఇక టెస్టులకురోహిత్ శర్మ సారథ్యం వహించబోతున్నారు. అయితే ఇటీవల వరల్డ్ కప్ లో తన సీమ్ బౌలింగ్ తో అదరగొట్టిన మహమ్మద్ షమీ ఇక సౌత్ ఆఫ్రికా తో జరగబోయే టెస్టుల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తాడు అని అందరూ అనుకున్నారు.


 కానీ ఊహించని రీతిలో అటు భారత జట్టుకు షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది. సౌత్ ఆఫ్రికా తో జరగబోయే తొలి టెస్ట్ కు ముందు టీమిండియా కు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. జట్టులో స్టార్ పెసర్గా కొనసాగుతున్న షమి చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం  ప్రస్తుతం అతను ముంబైలో ఆర్థోపెడిక్ చికిత్స తీసుకుంటున్నాడని.. బీసీసీఐ తెలిపింది. షమీ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే తప్ప.. సౌత్ ఆఫ్రికా తో ఈ నెల 26వ తేదీన జరిగే బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేదు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది. కాగా వరల్డ్ కప్ లో షమీ ఏడు మ్యాచ్లలో 24 బికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: