
ఈ క్రమంలోనే ఈ రెండు టీమ్స్ మధ్య టెస్ట్ సిరీస్ జరిగితే.. ప్రేక్షకులకు చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే మొన్నటికి మొన్న ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో ఫైనల్లో భారత జట్టును ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా జట్టు. అయితే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే అటు భారత జట్టు సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక వరల్డ్కప్ లో ఓడించిన ఆస్ట్రేలియాలో.. టి20 సిరీస్ లో మట్టి కనిపించింది టీమిండియా. అయితే జట్టులో సీనియర్లు లేకుండానే వరుస మ్యాచ్ లలో విజయం సాధించి 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
ఇక ఇటీవలే నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించినప్పటికీ ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న మాథ్యూ వేడ్ మాత్రం ఓ రికార్డు సృష్టించాడు. భారత జట్టుపై t20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగవ ప్లేయర్గా నిలిచాడు. ఇప్పటివరకు టీమిండియా పై 487 పరుగులు చేశాడు మాథ్యూ వేడ్. ఇక తొలి స్థానంలో నికోలస్ పూరన్ 592 పరుగులతో టాప్ లో ఉండగా.. తర్వాత గ్లైన్ మాక్స్ వెల్ 554 పరుగులు, ఆరోన్ పించ్ 500 పరుగులు, జాస్ బట్లర్ 475 పరుగులతో ఈ లిస్టులో ఉన్నారు అని చెప్పాలి.