
ఇలా టీమిండియాలోకి వచ్చి ఇక ఇప్పుడు కీలక ఆటగాడిగా మారిపోయిన ప్లేయర్ శుభమన్ గిల్. వచ్చిన కొన్నాళ్ళకి అతను టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ అనే నమ్మకాన్ని అందరిలో కలిగించాడు. అంతేకాదు భారత్ క్రికెట్ కి అతను ఒక ప్రిన్స్ అంటూ ఒక ట్యాగ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. అయితే ఇక తన ఆట తీరుతో ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొడుతున్నాడు అని చెప్పాలి. కేవలం ఒక్క ఫార్మాట్లో కాదు మూడు ఫార్మాట్ లలో కూడా అటు టీమిండియాకు అతను ఒక కీలక ప్లేయర్గా అవతరించాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే గిల్ ఇక ప్రతి ఫార్మాట్లో కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు.
ఇలా ప్రతిభగల క్రికెటర్ గా గుర్తింపును సంపాదించుకున్న గిల్ గురించి వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత జనరేషన్లో అత్యంత ప్రతిభ గల బ్యాట్స్మెన్ గిల్ అంటూ చెప్పుకొచ్చాడు లారా. టెస్టుల్లో నా రికార్డును గిల్ బద్దలు కొడతాడు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా బ్రియాన్ లారా పేరిట 501 బంతుల్లో 400 పరుగులు నాటౌట్ రికార్డు ఉంది అన్న విషయం తెలిసిందే. వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మ సాధించిన 264 పరుగుల రికార్డు తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో మరిన్ని రికార్డులను తిరగ రాయగల సత్తా గిల్ కీ ఉంది అంటూ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు.