క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు కొన్ని ఫన్నీ ఘటనలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అప్పటివరకు ఎంతో కఠినమైన బంతులను కూడా ఎదుర్కొన్న బ్యాట్స్మెన్లు.. ఇక అంతలోనే ఊహించని విధంగా అవుట్ అవుతూ ఉంటారు. ఏకంగా దురదృష్టం వెంటాడి చివరికి అనూహ్య రీతిలో వికెట్ కోల్పోయి ఫెవిలియన్ చేరుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి తరహా ఘటన ఏదైనా జరిగిందంటే చాలు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది.


 అయితే ఇటీవల జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే ఆతిథ్య బాంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది న్యూజిలాండ్. ఇక ఇప్పటికే తొలి టెస్ట్ ముగియగా తొలి టెస్టుల్లో బంగ్లాదేశ్ ఘనవిజయాన్ని అందుకుంది. ఇటీవల డాకా వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఒక ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగచక్కర్లు కొడుతుంది. అయితే బంగ్లాదేశ్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ముష్పికర్ రెహమాన్ మంచి ఆట తీరును కనబరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని 83 బంతుల్లో 35 పరుగులు చేశాడు. దీంతో అతను భారీ స్కోరు చేయడం ఖాయం అనుకుంటున్న సమయంలో జేమిసన్ వేసిన బంతిని డిపెండ్ చేసేందుకు ప్రయత్నించి విచిత్రమైన రీతిలో అవుట్ అయ్యాడు. బాల్ వికెట్ల నుంచి దూరంగా వెళుతున్న బంతిని కావాలనే చేతితో దూరంగా నెట్టాడు. దీంతో కివిస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్లు థర్డ్ అంపైర్ కు నివేదించారు. రీప్లేలో పరిశీలించిన తర్వాత థర్డ్ అంపైర్ కావాలని బంతిని చేతితో నెట్టేయడంతో అవుట్ గా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: