
ఇప్పటికే ఇలాంటి విషాదకర ఘటనలు చాలానే చూశాము. అయితే తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగు లోకి వచ్చింది. పాకిస్తాన్లోని షేర్ బాగ్ జంతు ప్రదర్శన శాలలో ఒక షాకింగ్ వెలుగు చూసింది. పులి బోనులో జూ సిబ్బంది సగం తిన్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. సదరు వ్యక్తి పులిబొనులోకి దూకి ఉంటాడు అని అక్కడి అధికారులు భావిస్తున్నారు అని చెప్పాలి. ఇక అక్కడ సీసీటీవీ ఫుటేజీ, ఎన్ క్లోజర్ నుంచి పులి వచ్చిన ఆధారాల ప్రకారం అతనిపై పులులు దాడి చేసిన సమయంలో అతను బ్రతికే ఉన్నట్లు భావిస్తున్నట్లు అని అధికారులు చెప్పుకొచ్చారు.
ఈ ఘటన తర్వాత పంజాబ్లోని తూర్పు ప్రావీన్స్ లో ఉన్న జూ మూసి వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా పులిబోనులోకి మనిషి ఎలా వెళ్లాడు అనే కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారూ అని చెప్పాలి. పులి మనిషి పై దాడి చేసేందుకు బోన్ లోనుండి రాలేదని సదరు వ్యక్తే ఏకంగా పులి ఆవరణలోకి వెళ్లినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. ఏదైనా భద్రతా లోపం ఉంటే దాని పరిష్కరించే దిశగా ముందుకు సాగుదాం అంటూ చెప్పుకోచ్చారు అధికారులు.