అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి షాట్లు మాత్రమే ఆడాలి అని ఒక నానుడి కొనసాగుతున్న సమయంలో తన ఆట తీరుతో సరికొత్త ట్రెండుకు నాంది పలికాడు సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఎబి డివిలియర్స్. ఏకంగా మైదానం నలువైపులా కూడా ఎంతో అలవోకగా షాట్లు ఆడి ప్రపంచ క్రికెట్లో ఏకంగా మిస్టర్ 360 ప్లేయర్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే ఏబి డివిలియర్స్ అటు మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే అతనికి ఎక్కడ బంతివేయాలో కూడా తెలియక బౌలర్లు తికమక పడుతూ ఉంటారు.


 ఎందుకంటే ఎక్కడ బంతి వేసిన కూడా దానిని ఇక మైదానం నలువైపులా బౌండరీలు  తరలించడంలో ఏబి డివిలియర్స్ దిట్టా అని చెప్పాలి. ఇక క్రికెట్లో అప్పటి వరకు ప్రేక్షకులు ఎక్కడా చూడని వినూత్నమైన షాట్లతో ఎప్పుడు డివిలియర్స్ అభిమానులను అలరిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అలాంటి ఆటగాడు అటు ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఎన్నో ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన  డివిలియర్స్ విరాట్ కోహ్లీకి బెస్ట్ ఫ్రెండ్ గా కూడా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్తో పాటు అన్ని ఫార్మాట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ స్టార్ ప్లేయర్.


 ఈ క్రమంలోనే తన కెరియర్ గురించి ఇటీవల ఒక షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు ఏబీడీ.  తన దృష్టి కొంత లోపించడంతోనే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాను అంటూ చెప్పుకొచ్చాడు. నా చిన్న కుమారుడు కాలు ప్రమాదవశాత్తు నా ఎడమ కంటికి తాకింది. దీంతో నా దృష్టి కొంత లోపించింది. డాక్టర్లను సంప్రదిస్తే ఆటను వదిలేయమని చెప్పారు. అందుకే క్రికెట్కు వీడ్కోలు పలికాను. కానీ రెండేళ్ల పాటు ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగాను అంటూ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. అప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు అంటూ తెలిపాడు. కాగా ఇలా కంటిచూపు లోపం ఉన్నప్పటికీ డివిలియర్స్ ఐపీఎల్లో ఎంత మంచి ప్రస్తానాన్ని కొనసాగించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: