ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను ఇటీవల ఆర్ధాంతరం గా జట్టు కెప్టెన్సీ  నుంచి తప్పిస్తూ ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమం లోనే అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను కొత్త సారధిగా నియమించింది అని చెప్పాలి. అయితే ఐదుసార్లు ముంబై ఇండియన్స్ కు టైటిల్ అందించిన కెప్టెన్గా ఉన్న రోహిత్ ను  తప్పించడం పై అటు అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.


 ఇన్నాళ్ల పాటు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి ముంబై ఇండియన్స్ కు మద్దతు పలికామని.. ముంబై మ్యాచ్ లను చూసామని.. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ లేని ముంబై ఇండియన్స్ ని మద్దతు పలకలేమంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇక ఆ జట్టు సోషల్ మీడియా ఖాతాలను కూడా అన్ ఫాలో చేస్తున్నారు అని చెప్పాలి. ఇప్పటికే 13 లక్షల మంది ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను అన్ పాలో చేశారు. ఇంకొంతమంది రోహిత్ శర్మ అభిమానులు ఏకంగా అటు ముంబై ఇండియన్స్ జెర్సీలను కూడా తగల బెడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 అంతే కాదు ఇక ముంబై ఇండియన్స్ యజమానులు అయినా ముఖేష్ అంబానీ కి చెందిన పలు కంపెనీలకు కూడా బాయ్ కాట్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమం లోనే బాయికాట్ జియో అనే హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. కొంతమంది తమ జియో సిమ్లను విరగొట్టి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా అకస్మాత్తుగా అటు రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో తీవ్ర స్థాయిలో ఆ జట్టు యాజమాన్యం పై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: