ఇదే ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర అని అనుకుంటున్న సమయంలో ఆ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కోల్కతా నైట్ రైడర్స్ మిగతా టీమ్స్ తో పోటీపడి మరి 24.75 కోట్లకు దక్కించుకుంది అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఏ భారత ఆటగాడు కూడా ఈ రేంజ్ లో భారీ ధర పలకలేదు. దీంతో విదేశీ ప్లేయర్లకే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇదే వేలంలో పాల్గొన్న పలువురు టీమిండియా ప్లేయర్లకు ఎక్కువ ధర పెట్టేందుకు ఆయా ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఇక ఇదే విషయం గురించి భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా స్పందించాడు.
ఇటీవల జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్లకు దక్కిన భారీ ధర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకవేళ విరాట్ కోహ్లీ ఐపిఎల్ వేలంలో పాల్గొంటే అతని దక్కించుకునేందుకు ప్రాంచైజీలు 42 నుంచి 45 కోట్ల వరకు వెచ్చించే అవకాశం ఉంది అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా 2008 ఐపీఎల్ ప్రారంభం సీజన్ నుంచి కూడా కోహ్లీ ఆర్సిబి తరపున ఆడుతున్నాడు. ఇక అప్పటి నుంచి ఒక్కసారి కూడా అతను వేలంలో పాల్గొనలేదు అని చెప్పాలి. అయితే రోహిత్, కోహ్లీ లాంటి ప్లేయర్లు ఒకవేళ వేలంలోకి వస్తే వారిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఎంత మొత్తంలో ధర పెడతాయో చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి