సాధారణంగా  ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి క్రేజ్ ఉంది కాబట్టి ఎంతో మంది యువ ఆటగాళ్లు క్రికెట్ ఫ్యాషన్ గా మార్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి యువ ఆటగాళ్లు వస్తూపోతూ ఉంటారు. కానీ కొంతమంది ప్లేయర్లు మాత్రమే తమ ప్రతిభ ఏంటో నిరూపించుకుని భారత జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఉంటారు.


 ఇలాగే టీమ్ ఇండియాలోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్లేయర్స్ లో బుమ్రా కూడా ఒకరు. ఇక అందరూ ఫాస్ట్ బౌలర్ల లాగానే ఇతను కూడా జట్టుల స్థానం సంపాదించుకున్నాడు. కానీ తన ప్రతిభతో అతి తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాకు కీలక బౌలర్గా మారిపోయాడు. ప్రస్తుతం డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు  అయితే బుమ్రా సందించే యార్కర్లకు అటు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ల దగ్గర కనీసం సమాధానం కూడా ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కీలకమైన డెత్ ఓవర్లలో  జట్టును కష్టాలు కడల నుంచి బయటపడేసిన సందర్భాలు బుమ్రా కెరియర్ లో చాలానే ఉన్నాయి.


 ఇలా టీమ్ ఇండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా తన కెరియర్ గురించి ఇటీవల ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ఒకానొక దశలో ఏకంగా కెనడాలో స్థిరపడాలని బుమ్రా అనుకున్నాడట. ఆయన భార్య సంజన గణేషన్ తో కలిసి చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. నా కెరియర్ తొలినాళ్లలో క్రికెట్ కలిసి రాకుంటే.. ఫ్యామిలీతో కలిసి కెనడా వెళ్లిపోయి అక్కడ బంధువుల దగ్గర ఉంటూ ఇక చదువును కొనసాగించాలని అనుకున్నా. కానీ దేశాన్ని విడిచి పెట్టేందుకు మా అమ్మ ఒప్పుకోలేదు. అదృష్టవశాత్తు నాకు టీమిండియాలో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి అంటూ బుమ్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: