ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ గత కొన్ని సీజన్స్ నుంచి మాత్రం ఎందుకో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు. ఈ క్రమంలోనే ఆ జట్టు యాజమాన్యం చివరికి 5 సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మని పక్కన పెట్టి హార్థిక్ పాండ్యా చేతికి సారధ్య బాధ్యతలు అప్పగించింది  ఇక ఈ సీజన్లో కొత్త కెప్టెన్ తో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది ముంబై ఇండియన్స్ జట్టు.


 ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ నుంచి వరుస ఓటములతో సతమతమై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. అయితే వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఇక ఇటీవలే మళ్లీ పుంజుకుంది ముంబై ఇండియన్స్. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది  ఇక ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జోరు చూస్తూ ఉంటే తప్పకుండా రానున్న రోజుల్లో ప్లే ఆఫ్ లో అడుగు పెట్టేలాగే కనిపిస్తుంది  అయితే ఇటీవల అటు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సూపర్ విక్టరీని నమోదు చేసింది ముంబై ఇండియన్స్  ఇక ఈ హ్యాట్రిక్ విజయంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు.


 కానీ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మాత్రం బిగ్ షాక్ తగిలింది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ పై గెలుపొందిన ఆనందం ఉన్న అటు ముంబై ఇండియన్స్ కు ఐపీఎల్ మేనేజ్మెంట్ భారీ జరిమానా విధించింది. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ ఫైన్ పడింది అని చెప్పాలి. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాకు ఏకంగా 12 లక్షల ఫైన్ వేసింది ఐపీఎల్ మేనేజ్మెంట్. అయితే ఇక ఇప్పటికే ఈ సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్ కు రెండుసార్లు గుజరాత్ కెప్టెన్ గిల్ కీ ఒక్కసారి జరిమానాలు పడ్డాయ్ అని అనుకుంటారు. అయితే రెండుసార్లు ఇలా స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ ఎదుర్కొన్న ఆటగాళ్లు.. మూడోసారి ఇదే తప్పు రిపీట్ చేస్తే నిషేధానికి గురవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: