ఎప్పటిలాగానే 2024 ఐపీఎల్ సీజన్ కూడా ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైర్మెంట్ పంచుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మార్చి 22వ తేదీ ప్రారంభమైన ఈ ఐపీఎల్ ప్రస్తుతం ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ ఐపీఎల్ సీజన్లో విజేతగా నిలవబోయే టీం ఏది అనే విషయంపై క్లారిటీ రాబోతుంది అని చెప్పాలి. ఇకపోతే ప్లే ఆఫ్ దశకు చేరుకోవడంతో ఐపీఎల్ పోరు మరింత రసవత్తంగా మారిపోయింది. కాగా ఈ ఐపిఎల్ సీజన్ లో ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా స్కోర్లు నమోదు అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 గత సీజన్ వరకు ఐపీఎల్లో ఒక మ్యాచ్ లో 200 స్కోర్ నమోదయింది అంటే అదే భారీ స్కోర్ అనుకునేవారు. కానీ ఇప్పుడు ఇక ప్రతి మ్యాచ్ లో 200 పరుగుల స్కోర్ నమోదు కావడం సర్వసాధారణంగా మారిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే పొట్టి ఫార్మాట్లో బ్యాట్స్మెన్లు సృష్టిస్తున్న విధ్వంసానికి ఇక బంతులు వేసి వికెట్లు తీయాల్సిన బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే t20 ఫార్మాట్ లో పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో బౌలర్లుగా మారేందుకు ఎవరు సాహసం చేయరు అంటూ మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై కొన్ని సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు అని చెప్పాలి.


 అయితే ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్ లో 200కు పైగా పరుగులు చేయడం అనేది.. ఎంతో సులభతరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే భవిష్యత్తులో కుర్రాళ్ళు ఎవరు కూడా బౌలింగ్ ను కెరియర్ గా ఎంచుకోరు అంటూ అనిల్ కుమార్ అభిప్రాయపడ్డాడు. అందుకే బౌండరీ లైన్ ల పరిధిని పెంచాలి అంటూ సూచించాడు. డగౌట్ ను స్టాండ్ లోకి మార్చాలని ఐసీసీకి తెలిపాడు. గ్రౌండ్ మధ్యనుంచి అన్ని వైపుల సమానంగా బౌండరీ లైన్లు ఉండాలి. బౌండరి లైన్ 77 మీటర్ల దూరం ఉండాలి. స్టేట్ బౌండరీ 64 మీటర్లు ఉండాలి. అలా అయితేనే బంతికి బ్యాట్ కి మధ్య పొట్టి ఫార్మాట్లో సమతూకం ఏర్పడుతుంది అంటూ అనిల్ కుంబ్లే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: