స్టార్ బ్యాట్స్మెన్ , వికెట్ కీపర్ , కెప్టెన్ అయినటువంటి ఎం ఎస్ ధోని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన బ్యాట్ తో భారీ షాట్ లను కొట్టడం మాత్రమే కాకుండా వికెట్ కీపర్ గా బ్యాటర్ కి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా స్టంపులు చేయడం అలాగే కెప్టెన్ గా ప్రత్యర్థులకు దిమ్మతిరిగిపోయే ప్రణాళికలను రచించడం , ఇలా ఎన్నో గొప్ప గొప్ప క్వాలిటీస్ తో ఈయన ఎన్నో సంవత్సరాలు అత్యున్నత ఆటను ప్రదర్శించి ఇండియా క్రికెట్ టీం కు ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. ఇకపోతే ఇండియా క్రికెట్ టీం నుండి రిటైర్మెంట్ తీసుకున్న ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఐ పీ ఎల్ మ్యాచ్ లలో ఆడుతున్నాడు.

ఇక ధోని ఆడబోయే చివరి ఐ పీ ఎల్ సీజన్ కూడా ఇదే అని , ఈ సీజన్ తర్వాత ఆయన ఐ పీ ఎల్ మ్యాచ్ లకి కూడా దూరంగా ఉండబోతున్నారు అని ఓ వార్త చాలా రోజులుగా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇలా ధోని ఈ సీజన్ తో ఐ పీ ఎల్ నుండి తప్పుకోబోతున్నారు అని వస్తున్న వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ అయినటువంటి హస్సి స్పందించాడు.  హస్సీ తాజాగా మాట్లాడుతూ ... ధోని అన్ని విషయాలను చాలా రహస్యంగా ఉంచుతారు.

రిటైర్మెంట్ పై అందరికీ ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. కాకపోతే జట్టు మాత్రం ఆయన ఇంకొన్ని సీజన్ లు ఆడాలి అని కోరుకుంటుంది. మోకాలి సమస్య తప్పితే తన బ్యాటింగ్ ఇంకా సూపర్ గానే ఉంది. అలాగే నెట్స్ లోను అందరికంటే ఎక్కువగా ధోని నే సాధన చేస్తూ ఉంటారు. మరి ఈ ఐ పీ ఎల్ తర్వాత ధోని కొనసాగుతారా లేక వైదొలుగుతారా అనేది ఆయన చేతుల్లోనే ఉంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అని హస్సీ తాజాగా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: