కొన్ని సందర్భాలలో కొన్ని జట్లు అద్భుతమైన రీతిలో కం బ్యాక్ అవుతూ ఉంటాయి. సీజన్ ప్రారంభంలో ఏమీ సాధించలేదు అనుకున్న జట్లు కూడా కొన్ని సందర్భాలలో ట్రోఫీలను ఎగరేసికెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ సారి ఐ పీ ఎల్ సీజన్ లో కూడా బెంగళూరు జట్టు ఫర్ఫార్మెన్స్ ఇదే రీతిలో ఉంది. భారీ అంచనాల నడుమ ఐ పీ ఎల్ 2924 లోకి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు అడుగు పెట్టింది. అడుగు పెట్టినది మొదలు ఈ జట్టు వరస అపజయాలను ఎదుర్కొంటూ వచ్చింది. మొదటి ఎనిమిది మ్యాచ్ లు పూర్తి అయ్యే సరికి కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది.

దానితో బెంగళూరు జట్టు ప్లే ఆప్స్ కు వెళ్లడం అనేది అసంభవం అని ఎంతో మంది క్రికెట్ అనలిస్టులు కూడా అనే దశలో ఈ టీం పర్ఫామెన్స్ ఇచ్చింది. కానీ ఒక్క సారిగా ఈ జట్టు తిరిగి కోలుకుంది. ఆఖరి ఆరు మ్యాచ్ లను గెలిస్తే తప్ప ప్లే ఆప్స్ కి వెళ్ళలేదు అనే స్థితిలో ఏకంగా ఆఖరి 6 మ్యాచ్ లను గెలిచి ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇంతటి గొప్ప పర్ఫామెన్స్ ను ఇచ్చిన ఈ జట్టుకు బెంగుళూరు పాత ఓనర్ అయినటువంటి విజయ మాల్యా సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ తెలిపాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆప్స్ కి చేరడంతో ఈ జట్టు ఆటగాళ్లకు , యాజమాన్యానికి విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు. టోర్నీ ఆరంభంలో వరుస ఓటములు వచ్చిన నిరాశ చెందకుండా గొప్ప సంకల్పంతో ముందుకు సాగారు. విజయాలతో టాప్ 4 లో నిలిచారు. ఇక వెనకడుగు వేయకుండా మీ ప్రయాణాన్ని ట్రోఫీ వైపు సాగించండి అని ఈయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఇక విజయ్ మాల్యా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vm