హాట్ యాంకర్ అనసూయ బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. క్షణం సినిమా తో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అప్పుడెప్పుడో 17 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ అయిపోయింది.. వెంటనే జబర్దస్త్ యాంకర్ అయిపోయింది.. ఆ తర్వాత నటిగా మారింది.. ఇప్పుడు స్టార్ అయిపోయింది.