ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ ని సాధించింది.సూపర్ హిట్ టాక్ తెచ్చుకునే సరికి సినిమా కు ఫామిలీ ఆడియెన్స్ కూడా రావడం మొదలుపెట్టారు. రిలీజ్ అయ్యి దాదాపు మూడు వారాలు అవుతున్న ఈ సినిమా రికార్డుల రికార్డులు కొడుతూనే ఉంది. తొలివారం సక్సెస్ ఫుల్ గా హౌస్ ఫుల్ గా నిండిన థియేటర్లు రెండో వారం కూడా అదే రేంజ్ మెయింటన్ చేసింది. ఈ వారం కొన్ని వేరే సినిమాలు రిలీజ్ అయినా వాటి ప్రభావం ఏమాత్రం ఉప్పెన పై పడలేదు.. ఇంకా ఈసినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తూనే ఉంది..