తెలుగు బిగ్ బాస్ 4 షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది..ఈ షో ఇప్పుడు ఎంతగా రోజు రోజుకు పాపులర్ అవుతుంది తెలిసిన విషయమే.. మొదట మూడు షో ల కన్నా కూడా ఈ షో బాగా జనాల్లోకి వెళ్ళింది. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి. పగటి పూట కాస్త గొడవలు, సాయంత్రం అయితే సరదాలు, రాత్రి అయితే రొమాన్స్ తో రచ్చలు ఇవన్నీ కూడా షో టీఆర్పీ రేటింగ్ ను పెంచుతున్నాయి. దాంతో ఈ షో కు డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఏడో వారం చివరి దశకు చేరుకుంది. ఈ వారం ఎలిమినేషన్ కాస్త ఉత్కంఠగా మారింది.



మోనాల్, అభిజీత్, అవినాష్, దివి, అరియానా, నోయల్‌ నామినేట్ అయ్యారు. మరి వాళ్ళల్లో ఎవరు తట్టా బుట్టా సర్దుకొని వెళ్తారు.. ఎవరు ఉంటారో ఆదివారం ఎపిసోడ్ లో చూడాలి.. ఇక అసలు విషయానికి కోస్తే.. ఈ సీజన్ రొమాంటిక్ పక్షులు అంటే గుర్తొచ్చేది మాత్రం మోనాల్, అఖిల్.. ఎప్పుడు చూసిన కూడా ఏదో కావాలనే ఆలోచనలో ఉంటారు. అయితే ఇప్పుడు కొంచెం మోనాల్ రూట్ మార్చింది.  ఈ మధ్య కాస్త దూరంగా ఉన్న మోనాల్ నిన్నటి ఎపిసోడ్ లో కాస్త చిలిపి సరసాలు ఆడింది. స్లీపింగ్ రూమ్ లో ఇద్దరు చెరోక బెడ్ పై పడుకోని మాట్లాడుకున్నారు. పర్సనల్ విషయాలను పంచుకున్నారు.



ఎప్పుడు లేని విధంగా మోనాల్ అఖిల్ కు పిట్ట కథ చెప్పింది.. అదేంటంటే తను పెళ్లయిందని, తను ప్రస్తుతం గర్భవతి అని అందుకే జాగ్రత్తగా ఉందని ఏవేవో చెప్పింది. తనకు , తన భర్తకు ట్రావెల్ అంటే చాలా ఇష్టమట..ఎప్పుడు తిరిగే వాళ్ళమని చెప్పుకొచ్చింది.. అలా ఒక అపద్ధాన్ని నిజం లాగా చెప్పింది.వీళ్ల కాన్వర్జేషన్ చూస్తున్న ఎవరికైనా ఇది ఉత్త గ్యాస్ అని అర్థమైపోతుంది. మొత్తానికి దీని ద్వారా బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు ఏదో వినోదం పంచాలనే ఉద్దేశంతో ప్రసారం చేసినట్టున్నారు.. కానీ మొత్తం రివర్స్ అయ్యింది. ఇకపోతే ఈ వారం మోనాల్ ఎలిమినేట్ అవ్వడం పక్కా అని అంటున్నారు. మరి నెక్స్ట్ అఖిల్ ఎవరితో పులిహోర కలుపుతాడో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: